Advertisement

కొండా సురేఖ చేరిక ప్రచారంపై మురళీధర్ రావు ఘాటు వ్యాఖ్యలు

మన పత్రిక: తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ బీజేపీలో చేరుతారంటూ వస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత పి. మురళీధర్ రావు తీవ్రంగా తోసిపుచ్చారు. ఇతర పార్టీల నుంచి బహిష్కరణకు గురైన నాయకులను చేర్చుకోవడానికి బీజేపీ డంపింగ్ బిన్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలోకి తీసుకునే వారి విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉంటాయని, ఎవరిని పడితే వారిని చేర్చుకునే ప్రసక్తి లేదని తెలిపారు.

ఇటీవల ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల నేపథ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారని, ఆ తర్వాత ఆమె బీజేపీ వైపు చూస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారని మురళీధర్ రావు ఆరోపించారు. బీజేపీలో కొందరి నుంచి సానుభూతి వ్యక్తమైనప్పటికీ, ఆమె చేరికను వ్యతిరేకించే వర్గం కూడా బలంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement