Advertisement

మళ్లీ జతకడుతున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య

మన పత్రిక: ‘బేబీ’ సినిమాతో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మళ్లీ ప్రేక్షకు ముందుకు రాబోతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే కొత్త చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కళాశాల నేపథ్యంలో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రేమ, స్నేహం, యువతకు ఎదురయ్యే అనుభవాల చుట్టూ ఈ కథ సాగనుంది.

గతంలో వచ్చిన ‘బేబీ’ చిత్రంలో వీరి నటనకు మంచి ఆదరణ లభించడంతో, ఈ జంట మళ్లీ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement