Advertisement

యాంకర్ మహేంద్రను వివాహం చేసుకున్న నటి శిరీష

మన పత్రిక: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా సుపరిచితురాలైన నటి శిరీష, యాంకర్ మరియు నటుడు మహేంద్రను వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుండగా, శుక్రవారం జరిగిన ఒక సరళమైన వేడుకలో ఇరు కుటుంబాల అంగీకారంతో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన శిరీష, ‘మొగలిరేకులు’తో పాటు రాములమ్మ, స్వాతిచినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం వంటి పలు సీరియళ్లలో నటించారు. ఆమె గతంలో నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా, ఒక కుమారుడు ఉన్నాడు. పరిస్థితుల కారణంగా 2024లో వారు విడిపోతున్నట్లు శిరీష అధికారికంగా ప్రకటించారు.

Advertisement

రేడియో జోకీగా కెరీర్ ప్రారంభించిన మహేంద్ర, ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువ వంటి సీరియళ్లలో నటించారు. ప్రస్తుతం ఆయన సినిమాల ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేస్తూ నటుడిగా కొనసాగుతున్నారు. ఈ వివాహ వార్త వెలువడిన అనంతరం పలువురు నటీనటులు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement