Advertisement

ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ కవర్‌పేజీపై అల్లు అర్జున్

మన పత్రిక: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 100 మంది ప్రముఖులతో ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘షోస్టాపర్స్ 2026’ ప్రత్యేక ఎడిషన్ కవర్‌పేజీపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. తమ పనితీరు, ప్రజాదరణ, ప్రభావంతో ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రముఖులను గౌరవిస్తూ ఈ ప్రత్యేక సంచికను రూపొందించినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.

‘పుష్ప’ చిత్రాల భారీ విజయంతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. వినోదం, క్రీడలు, సంగీతం తదితర రంగాలకు చెందిన ప్రముఖులతో రూపొందించిన ఈ 100 మంది జాబితాలో మరో తెలుగు నటుడు రామ్ చరణ్ కూడా చోటు దక్కించుకున్నారు.

Advertisement
Advertisement