మన పత్రిక: రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు, అయ్యప్ప దీక్ష నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె ‘మనమ్మ’ అనే ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నక్షత్రను దర్శకుడి బృందం గుర్తించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నక్షత్ర సోషల్ మీడియా వీడియోలను చూసిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌కు పిలిచి ఈ పాత్రకు ఎంపిక చేసింది. తొలి తెలుగు చిత్రంలోనే ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించడంతో నక్షత్ర మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ చిత్రంలో నటించినందుకు గాను నక్షత్రకు దాదాపు రూ. 10 లక్షల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పారితోషికం వివరాలపై అధికారిక ప్రకటన రానప్పటికీ, ఆమె పాత్ర ప్రాధాన్యతను బట్టి ఈ మొత్తాన్ని అందించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాతో నక్షత్రకు మరింతగా నటనావకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
