Advertisement

ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల తేదీలో మార్పు లేదని మేకర్స్ స్పష్టత

మన పత్రిక: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

ప్రొడక్షన్ షెడ్యూల్‌కు సంబంధించి రకరకాల చర్చలు నడుస్తున్నప్పటికీ, ముందుగా ప్రకటించిన తేదీకే కట్టుబడి ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

Advertisement