Advertisement

రష్యా చమురు కొనుగోలు దేశాలపై ఆంక్షల బిల్లును ఆమోదించిన అమెరికా సెనేట్

మన పత్రిక: రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై కఠిన ఆంక్షలు విధించే ప్రతిపాదనలతో కూడిన బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ‘లిండ్సే ఓ. గ్రాహం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం 2026’ పేరుతో ఉన్న ఈ బిల్లు సెనేట్‌లో 86-11 ఓట్ల తేడాతో నెగ్గింది. ఈ చట్టం అమలులోకి వస్తే రష్యా పెట్రోలియం ఉత్పత్తుల ప్రధాన కొనుగోలుదారులైన భారత్, చైనాలతో పాటు ఇతర దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న మొదటి ఐదు దేశాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పిస్తుంది. ప్రస్తుతం రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న అగ్ర స్థానాల్లో చైనా, భారత్, అజర్‌బైజాన్, హంగేరి, స్లోవేకియా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అక్కడి అధికారులు, ఆర్థిక సంస్థలపైనా ఆంక్షలు విధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.

Advertisement

సెనేటర్ల భిన్నాభిప్రాయాలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరోధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నప్పటికీ, ఈ బిల్లు వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరకపోవచ్చని కొందరు అమెరికన్ సెనేటర్లు అభిప్రాయపడ్డారు. ఇది రష్యాను జవాబుదారీగా చేయకపోగా, ట్రంప్ తన వాణిజ్య విధానాల్లో భాగంగా మరిన్ని సుంకాలు విధించడానికి వీలు కల్పిస్తుందని వారు హెచ్చరించారు.

Advertisement