Advertisement

మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు, గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యే అవకాశం

మన పత్రిక: పశ్చిమాసియాలో ఇరాన్, ఒమన్‌ల మధ్య జరుగుతున్న చర్చలు అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే ట్రంప్ నిర్ణయాలపై ఉన్న అనుమానాల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచ మార్కెట్లు మిశ్రమ ధోరణిలో స్పందిస్తున్నాయి. గత సెషన్‌లో అమెరికా, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు కూడా అదే రీతిలో సాగుతున్నాయి.

గత సెషన్‌లో అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్ 0.83 శాతం, ఎస్ అండ్ పీ 0.17 శాతం మేర నష్టపోగా, డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.17 శాతం లాభంతో ఉంది. యూరోప్ మార్కెట్లలో యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.08 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.03 శాతం లాభ పడగా, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.29 శాతం నష్టపోయింది.

Advertisement

ఆసియా మార్కెట్లు మరియు భారత సూచీల సంకేతాలు

ఆసియా మార్కెట్లలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.87 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.41 శాతం లాభాలతో సాగుతున్నాయి. మరోవైపు సౌత్ కొరియా కోస్పీ 4.30 శాతం, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్ 1.70 శాతం, జపాన్ నిక్కీ 1.37 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.85 శాతం నష్టాల్లో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.27 శాతం నష్టంతో కనిపిస్తున్నప్పటికీ, మన స్టాక్ మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆరు సెషన్ల కొనుగోళ్ల తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో వారు రూ. 943 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, స్వదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 2,883 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు బలపడి 95.12 వద్దకు చేరింది. డాలర్ ఇండెక్స్ 99.66 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.61 వద్ద కొనసాగుతుండగా, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.79 డాలర్ల వద్ద ఉంది.

Advertisement