Advertisement

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉపసంహరించిన ఎయిర్‌టెల్

మన పత్రిక: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అందుబాటులో ఉన్న రూ.299 విలువైన ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, ఫ్రీ కాలర్ ట్యూన్స్ మరియు పెర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ అందించే ఈ ప్యాక్‌ను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి పూర్తిగా తొలగించింది.

ఈ ప్లాన్ రద్దు కావడంతో ఎయిర్‌టెల్‌లో ప్రాథమిక రీఛార్జ్ ధర రూ.349కి చేరింది. రూ.349 ప్లాన్‌ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు మరియు ఆరు నెలల యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

Advertisement

మరికొన్ని ప్యాక్‌లు నిలిపివేత

రూ.299 ప్లాన్‌తో పాటు రూ.579, రూ.619 రీఛార్జ్ ప్యాక్‌లను కూడా ఎయిర్‌టెల్ నిలిపివేసినట్లు సమాచారం. రూ.579 ప్లాన్ కింద 56 రోజులు, రూ.619 ప్లాన్ కింద 60 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా లభించేది. ప్రస్తుతం ఈ రెండు ప్లాన్లు కూడా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు. వీటిని మొదట కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో తొలగించి, ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లోనూ నిలిపివేసినట్లు తెలిసింది.

Advertisement