Advertisement

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

మన పత్రిక: ఎగువన కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయికి చేరడం, తుంగభద్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జూరాల మీదుగా శ్రీశైలానికి ప్రవాహం కొనసాగుతోంది.

జూరాల ప్రాజెక్టుకు 2,44,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, జలవిద్యుత్ ఉత్పత్తితో పాటు 33 స్పిల్‌వే గేట్ల ద్వారా 2,45,000 క్యూసెక్కుల ನೀటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ನೀరు నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండటంతో రోజుకు దాదాపు 21 టీఎంసీల నీరు జలాశయంలోకి వస్తోంది.

Advertisement

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 118 టీఎంసీలకు చేరింది. జలాశయం పూర్తి స్థాయికి చేరడానికి ఇంకా దాదాపు 97 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. ఇదే స్థాయిలో మరో నాలుగు రోజుల పాటు వరద కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు.

Advertisement