Advertisement

అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. రాజకీయం కంటే పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు.

గతంలో రాయలసీమ ప్రాంతంలో వైఎస్‌ఆర్‌సీపీ బలంగా ఉన్నప్పటికీ, ఇటీవల ఎన్నికల్లో కూటమికి ఆదరణ లభించింది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ తయారీ రంగ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ పారిశ్రామిక పురోగతి పట్ల సీమ ప్రాంత ప్రజల్లో సానుకూలత కనిపిస్తోందని భావిస్తున్నారు.

Advertisement

ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు, ఉభయ గోదావరిపై పవన్ దృష్టి

మరోవైపు ఉత్తరాంధ్రలో సైతం అభివృద్ధి కార్యక్రమాలతో పట్టు నిలుపుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రత్యేక రైల్వే జోన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, నూతన పోర్టులు, ఐటీ పరిశ్రమలు, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో ప్రాంతీయ ప్రగతికి బాటలు వేస్తోంది. దీనికితోడు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాజకీయంగా బలం తగ్గకుండా చూసుకునే బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి నేతలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement