Advertisement

కాళేశ్వరం నీటితో కళకళలాడుతున్న శ్రీరాంసాగర్ వరద కాలువ

మన పత్రిక, బాల్కొండ: కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) వరద కాలువ జలకళ సంతరించుకుంది. పునరుజ్జీవ పథకంలో భాగంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వరద కాలువ నిండుగా మారింది.

జగిత్యాల జిల్లాలోని రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తుండటంతో ముప్కాల్ పంప్‌హౌస్ వరకు ప్రవాహం వస్తోంది. సుమారు 30 కిలోమీటర్ల మేర వరద కాలువలో దాదాపు ఐదు మీటర్ల లోతు వరకు నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాలువలో సమృద్ధిగా నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు సాగు అవసరాలకు తోడ్పడటంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరగడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement