మన పత్రిక: భోగాపురం విమానాశ్రయంలో ప్రయాణికుల వినియోగ రుసుములను (UDF) విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ (AERA) ఖరారు చేసింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీల ప్రకారం భోగాపురం నుంచి బయలుదేరే డొమెస్టిక్ ప్రయాణికులు రూ.835, అంతర్జాతీయ ప్రయాణికులు రూ.1,255 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకునే డొమెస్టిక్ ప్రయాణికులకు రూ.355, విదేశాల నుంచి వచ్చే వారికి రూ.545 ఫీజుగా నిర్ధారించారు. ఈ రుసుములను విమాన టికెట్ ధరలోనే కలిపి వసూలు చేయనున్నారు.
ఈ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం విశాఖపట్నంలోని నావికాదళం పరిధిలో ఉన్న పౌర విమానయాన సేవలను పూర్తిగా ఇక్కడికే తరలించనున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టును ఇకపై అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించనున్నారు.
విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ విమాన రాకపోకల షెడ్యూల్‌పై కూడా అధికారులు స్పష్టతనిచ్చారు. ఆగస్టు 16న సింగపూర్ నుంచి మొదటి విమానం భోగాపురం చేరుకోనుండగా, ఆగస్టు 17న అర్ధరాత్రి తిరిగి సింగపూర్ బయలుదేరేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద నీరు
- రామాయణ ట్రైలర్ విడుదల: ఆకట్టుకుంటున్న రణబీర్, సాయి పల్లవి, యష్
- తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అతి భారీ వర్ష సూచన
- దేశంలో స్థిరంగా ఉన్న పసిడి ధరలు: హైదరాబాద్‌లో ఎంతంటే?
- విద్యుత్ ఘాతంతో మరణిస్తే ₹8 లక్షల ఎక్స్‌గ్రేషియా: టిజిఎస్పిడిసిఎల్
