Advertisement

ఏపీలో పెట్టుబడులకు తైవాన్ ఆసక్తి: సీఎం చంద్రబాబు, లోకేశ్‌తో

మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌లతో వేర్వేరుగా సమావేశమైంది.

ఈ భేటీలో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ రంగాలు, సాంకేతిక సహకారంపై చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి వివరించారు. తయారీ, సాంకేతిక విభాగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరువర్గాలు అంగీకారం తెలిపాయి. అలాగే ఏపీలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడంపై కీలక ఒప్పందాలు చేసుకున్నారు.

Advertisement
Advertisement