Advertisement

బొండా ఉమాకు నోటీసులపై చంద్రబాబుపై అంబటి రాంబాబు ధ్వజం

మన పత్రిక: ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నారనే కారణంతో తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమాకు ఆ పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభిన్న రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ కాపు సామాజికవర్గ కార్యక్రమాల్లో నాయకులు ఒకే వేదికపై కలవడం సహజమని ఆయన పేర్కొన్నారు.

తామిద్దరం పక్కపక్కనే కూర్చోవడంపై బొండా ఉమా నుంచి వివరణ కోరడాన్ని చంద్రబాబు దిగజారుడు రాజకీయాగా అంబటి రాంబాబు అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులతో తప్ప ఇతరులతో మాట్లాడకూడదని ఏమైనా నిబంధన ఉందా అని ఆయన ప్రశ్నించారు. కాపు నేతల సభల్లో వివిధ పార్టీల నాయకులు హాజరవుతుంటారని, అంతమాత్రాన దానిని తప్పుగా పరిగణించడం సరైనది కాదని చెప్పారు.

Advertisement

రాష్ట్రంలో వర్షాలు లేక, నిరుద్యోగ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై దృష్టి సారించకుండా బొండా ఉమా తన పక్కన కూర్చోవడాన్నే పెద్ద అంశంగా మార్చారని అంబటి విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులతో వేదికలు పంచుకోకూడదనే నెపంతో కాపు నేతల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Advertisement