Advertisement

నల్లమలలో పులుల సంరక్షణకు చర్యలు పెంచుతాం: పవన్ కల్యాణ్

మన పత్రిక: అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పులుల సంరక్షణపై కీలక ప్రకటన చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల గాండ్రింపును శాశ్వతం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పులుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతామని ఆయన వెల్లడించారు.

ఈ దిశగా తూర్పు కనుమల్లోకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నాలుగు ఆడ పులులను తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అక్రమ వేటను అడ్డుకునేందుకు వేట నిరోధక శిబిరాల సంఖ్యను 150కి పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అటవీ ప్రాంత సంరక్షణలో భాగస్వామ్యం చేస్తూ గిరిజన యువతకు 800 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

Advertisement
Advertisement