Advertisement

రాయలసీమలో రూ.5,350 కోట్లతో టాటా పవర్ ప్లాంట్లు

మన పత్రిక: రాయలసీమ ప్రాంతాన్ని పునరుత్పాదక ఇంధన హబ్‌గా తీర్చిదిద్దేందుకు టాటా పవర్ సంస్థ రూ.5,350 కోట్ల భారీ పెట్టుబడితో ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ పెట్టుబడితో మొత్తం 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను అందుబాటులోకి తేనున్నారు. పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు.

ప్రాంతీయ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అవసరాలను సమర్థంగా తీర్చడమే లక్ష్యంగా ఈ ప్లాంట్లను రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement