Advertisement

శ్రీవారి సేవకులకు సిబిల్ తరహా రేటింగ్ తీసుకురానున్న టీటీడీ

మన పత్రిక, తిరుమల: తిరుమల శ్రీవారి సేవకుల పనితీరును మెరుగుపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక కొత్త విధానాన్ని తీసుకురానుంది. బ్యాంకుల్లో రుణాల మంజూరుకు ఉపయోగించే సిబిల్ స్కోరు తరహాలోనే, శ్రీవారి సేవకుల పనితీరు ఆధారంగా వారికి రేటింగ్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రేటింగ్ ఆధారంగానే సేవకులకు భవిష్యత్తులో విధులను కేటాయించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో కూడా శ్రీవారి సేవలను విస్తరించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సేవకుల సేవా విధానంలో మార్పులు చేస్తూ ఈ సరికొత్త రేటింగ్ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు.

Advertisement

మరోవైపు, తిరుపతిలో బుధవారం శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తిరిగి గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా భక్తులకు సర్వదర్శనం టోకెన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement