Advertisement

మంత్రి లోకేశ్‌ను విమర్శించే అర్హత కాకాణికి లేదు: సోమిరెడ్డి ఫైర్

మన పత్రిక, మనుబోలు: ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను విమర్శించే అర్హత వైకాపా నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా మనుబోలులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాకాణి గతంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన ఆయన, వాటిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement