మన పత్రిక, తిరుపతి: డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా డిమాండ్ చేశారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెకండ్ గేట్ వద్ద వైసీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.
జీవో 420 జారీ చేసి అర్హత లేని దాదాపు 427 మందికి అక్రమంగా పోస్టులు ఇచ్చారని, పరీక్షల నిర్వహణలో తీవ్రమైన అక్రమాలు చోటుచేసుకున్నాయని రోజా ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు.
రూ. 7 వేల కోట్ల బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని, దీనివల్ల విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారని రోజా పేర్కొన్నారు. ప్రభుత్వం తమ అనుకూల ప్రచార పత్రికలను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని, మహిళల రక్షణను, నిరుద్యోగుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- ఎల్నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష: పంటల రక్షణకు చర్యలు
- ముద్రగడతో వ్యక్తిగత అనుబంధమే ఉంది, రాజకీయం లేదు: జ్యోతుల నెహ్రూ
- సింహాచలంలో వైభవంగా గిరిప్రదక్షిణ పోటెత్తిన భక్తజనం
- ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
- శ్రీకాకుళం జిల్లా జైల్లో సీదిరి అప్పలరాజును జగన్ కలుసుకోనున్నారు
