మన పత్రిక: తన పెనమలూరు పర్యటనలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఏపీ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిరాకరించారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారు సంతోషంతో తనకు ధన్యవాదాలు తెలిపేందుకు ర్యాలీగా వచ్చారని లోకేశ్ తెలిపారు. అంగన్‌వాడీలు తెలిపిన ఆ కృతజ్ఞతా ప్రదర్శనను వైసీపీ నేతలు నిరసనగా చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు.
సోషల్ మీడియా వేదికగా అసలైన చిత్రాలతో పాటు వైసీపీ ప్రచారం చేసిన ఫోటోలను పంచుకున్న లోకేశ్, విపక్షాల ‘ఫేక్ న్యూస్’ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు, అంగన్‌వాడీలకు మేలు జరుగుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షం ఇలాంటి అసత్య ప్రచారాలకు ఒడిగడుతోందని ఆయన పేర్కొన్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
