Advertisement

తమ్మినేని సీతారాం దంపతులకు తాత్కాలిక బెయిల్ మంజూరు

మన పత్రిక: భూకబ్జా ఆరోపణల కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి సంబంధించిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారి కుమారుడు తమ్మినేని నాగ్‌కు మాత్రం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాగ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసు విచారణ సందర్భంగా తమ్మినేని నాగ్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అదే సమయంలో తమ్మినేని సీతారాం ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement