Advertisement

రాష్ట్రంలో టీడీపీ 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రారంభం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 45 రోజుల పాటు ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయికి వెళ్తున్న పార్టీ నేతలు, కూటమి ప్రభుత్వంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను కూడా నేరుగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి మొదలుకొని వార్డు స్థాయి కార్యకర్తల వరకు అందరూ ఈ ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. ఈ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి నుంచి స్పందన లభిస్తోందని నాయకులు తెలిపారు.

Advertisement