Advertisement

ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: సీఎం చంద్రబాబు సమీక్ష

మన పత్రిక: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడం ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement