Advertisement

డీఎస్సీ అంశంపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి నారా లోకేశ్

మన పత్రిక, అమరావతి: డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కేవలం డీఎస్సీపైనే కాకుండా, గత వైసీపీ పాలనలో జరిగినట్లు చెబుతున్న మద్యం, భూ కుంభకోణాల అంశాలపై కూడా చర్చించేందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.

వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి లోకేశ్, ఆయనకు ‘క్రెడిట్ చోర్ డిజార్డర్’ అనే రుగ్మత ఉందంటూ వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం విజయ సాధనే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, సాధిస్తున్న విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement