Advertisement

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఏపీ ఘనత: లోక్‌సభలో కేంద్రం వెల్లడి

మన పత్రిక: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపులో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతి సాధించినట్లు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 3,865 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరగడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలు, తీసుకున్న చర్యల కారణంగానే ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, 2029 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.

Advertisement
Advertisement