Advertisement

కెనడా కంపెనీలో పిఠాపురం యువకుడికి రూ.1.06 కోట్ల ప్యాకేజీ

మన పత్రిక: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కుతుకూడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తీ అఖిలేష్ కెనడాకు చెందిన ఒక సంస్థలో ఏఐ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో రూ.1.06 కోట్ల (రూ.1.05 కోట్లు) వార్షిక ప్యాకేజీ ఆఫర్ లెటర్ అందుకున్న ఆయన, ఇటీవల విధుల బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేసే వెసులుబాటు కలిగి ఉందని అఖిలేష్ తెలిపారు.

మాల్తీ అఖిలేష్ తండ్రి గంగాధరరావు చెవిటి, మూగ వ్యక్తి కాగా, ఆయన టైలరింగ్ పని చేస్తూ కొద్దిపాటి ఆదాయంతోనే తన ఇద్దరు పిల్లలను చదివించారు. తల్లి కూడా భర్త కుట్టే దుస్తులకు చేతి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అఖిలేష్ కొత్తపల్లిలోని వివిఎస్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి, అనంతరం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేశారు. ఆ తర్వాత సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం ఈ గొప్ప విజయాన్ని సాధించారు.

Advertisement
Advertisement