Advertisement

హాస్పిటల్‌ బెడ్‌పై వైఎస్ షర్మిల సర్జరీ జరిగినట్లు వెల్లడించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS Sharmila కు శస్త్రచికిత్స జరిగింది. తనకు పొత్తికడుపు సంబంధిత ఆపరేషన్ జరిగినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల సర్జరీ జరగడం వల్లే తాను కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న చిత్రాలను షర్మిల ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. తాను శస్త్రచికిత్స తర్వాత వేగంగా కోలుకుంటున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.

Advertisement
Advertisement