Advertisement

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అదనంగా రూ.99.40 కోట్లు మంజూరు

మన పత్రిక, హైదరాబాద్: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. Vemulawada Temple ప్రాంగణంలో మౌలిక వసతుల కల్పన, విస్తరణ పనులను వేగవంతం చేసేందుకు ఈ నిధులను కేటాయించారు.

మొత్తం రూ.249.40 కోట్లకు చేరిన నిధులు

గతంలో 2023-24 బడ్జెట్‌లో ఈ ఆలయానికి రూ.50 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. తాజాగా మంజూరైన రూ.99.40 కోట్లతో కలిపి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు రూ.249.40 కోట్లకు చేరాయి.

Advertisement

ఆలయంలో మౌలిక వసతుల కల్పన, విస్తరణకు సంబంధించిన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 45 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, కొత్తగా మంజూరైన నిధులతో మిగిలిన పనులు మరింత వేగంగా జరుగుతాయని వారు వివరించారు.

Advertisement