Advertisement

తిరువణ్ణామలైలో విషాదం: మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

మన పత్రిక: తిరువణ్ణామలైలో అరుణాచల గిరి ప్రదక్షిణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయార్ ఆలయ గుహలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ అనే భక్తుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఆలయ గుహలోని మోక్ష మార్గం ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఆయన అందులో ఇరుక్కుపోయారు. శ్వాస తీసుకోవడం కష్టమవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలిసింది. అధిక బరువు ఉన్న భక్తులు ఈ గుహలోకి వెళ్లకూడదని ఆలయ వర్గాలు సూచించాయి.

Advertisement
Advertisement