Advertisement

ఆగస్టు నుంచి సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం కానుంది: సీఎం చంద్రబాబు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఆగస్టు నుంచి Sanjeevani Health Scheme ను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు పెంచేందుకు వేదవతి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి నీరు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తమ పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. తాను ఎలాంటి పరదాలు కట్టకుండా నేరుగా ప్రజల మధ్యకు వస్తున్నానని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement