Advertisement

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓకు బిజెపి ఫిర్యాదు

మన పత్రిక, హైదరాబాద్: ఓటర్ల జాబితా నమోదు సమయంలో ఓటర్ల జాబితాలో లేకపోతే సంక్షేమ పథకాలు అందవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారంటూ బిజెపి నాయకులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (సీఈఓ) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, సీఈఓకు వినతిపత్రంతో పాటు ఒక వీడియోను కూడా శనివారం జులై 25న సమర్పించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగారని బిజెపి ఆరోపించింది. ఓటు నమోదు ఆధారంగా సంక్షేమ ఫలాలను నిరాకరిస్తామని అనడం చట్టపరంగా తప్పని, ఇది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఓటర్ ఐడీ కార్డు అనేది ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి కాదని స్పష్టం చేస్తూ, రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా నోటీసులు ఇవ్వాలని బిజెపి కోరింది. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇచ్చిన స్పష్టతను మీడియా, సోషల్ మీడియా ద్వారా విడుదల చేయాలని సీఈఓకు విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement