Advertisement

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సర్వదర్శనానికి 24 గంటల సమయం

మన పత్రిక: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వచ్చి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. తిరుమల కొండపైకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. మరోవైపు శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఒక్క రోజే రూ. 4.98 కోట్ల హుండీ ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement