మన పత్రిక, వెబ్‌డెస్క్
Bhadrachalam News : చర్ల మామిడి గూడెం లో 62,65/A సర్వే నెంబర్ గల పోడుభూమిని సాగులో ఉన్న గిరిజనకు ఆదివాసీలకు అప్పగించాలనీ CPI (ML)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో PO వినతి పత్రం . చర్ల మండలం మామిడిగూడెం గిరిజన ఆదివాసిలు సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి గత 20 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా దౌర్జన్యం ఏడుగురు మహిళలను జీబులో ఎక్కించుకొని బెదిరించి వారి పైన అక్రమ కేసులు పెట్టి జైలునిర్బంధానికి గురి చేశారు తక్షణమే వారిని బయటికి విడుదల చేయాలని పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 62, 65 బై ఏ లో 1995 నుంచి సాగులో ఉన్నారు ఈ భూమికి సర్వే చేసి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు కూడా కొంతమందికి వచ్చాయి పట్టాలు రాని భూమిని ఫారెస్ట్ అధికారులు గుంజుకోవాలని అందులో మొక్కలు ప్లాంటేషన్ చేయాలని ఇవాళ గిరిజన ఆదివాసుల పైన సమితి ప్రేమ వలకపోస్తూ వాళ్లకు మోసపూరిత మాటలు చెప్పి వాళ్ళ భూమిని వాళ్లకు కాకుండా చేయాలని చూస్తా ఉన్నారు ఆదివాసులకు భారత రాజ్యాంగంలో రాయబడిన సిక్స్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం అటవీ హక్కుల చట్టం ప్రకారం 1/70 యాక్ట్ ప్రకారం,పీ సా చట్టం ప్రకారం అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అక్రమ కేసులు పెట్టిన ఏడుగురు మహిళలను కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం పిఓ గారు వారం రోజులలో ఈ సమస్య పరిష్కారం చేయాలని లేనియెడల ఆదివాసీలను అంత ఐక్యం చేసుకొని ఐటీడీఏ ముందు ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం తెల్లం పెంటమ్మ తెల్లం రామకృష్ణ బొర్రం సరోజిని తెల్లం సాయమ్మ తెల్లం లక్ష్మయ్య చల్లం భీమయ్య కారం నాగరత్నం తెల్లం అరుణ తదితరులు పాల్గొన్నారు
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
