మన పత్రిక: వైసీపీ నేత, మాజీ మంత్రి Jogi Ramesh కుటుంబ సభ్యులపై అదనపు కట్నం వేధింపులు, గృహ హింస ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. అదనపు కట్నం కోసం తనను వేధించడమే కాకుండా, దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ జోగి రమేశ్ పెద్ద కోడలు జోగి మేఘన పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు ఆయన భార్య శకుంతల, కుమారుడు జోగి రాజీవ్ (బాధితురాలి భర్త), మరో కుమారుడు జోగి రోహిత్, కుమార్తె జోగి ప్రియాంకలపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు రమేశ్ సోదరుడు జోగి రాము, ఆయన కుమారులు రాకేశ్, పాండు, రమేశ్ బావమరిది స్వామి, ఆయన కుమారుడు సంతోశ్ (సాయి), రమేశ్ సోదరి రమ సహా మొత్తం 11 మందిని ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. వరకట్న నిరోధక చట్టం, గృహహింస, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
