మన పత్రిక: భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర విద్యుత్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా అతిపెద్ద ధింసా నృత్యంతో ఘనస్వాగతం పలకాలని ఆదేశించారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై అదనపు కట్నం, గృహ హింస కేసు నమోదు
- ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కరోనా కేసులు: మరో ఏడుగురికి పాజిటివ్
- హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్
- జులై 31 నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోతే రుసుముతో పాటు వడ్డీ భారం పడే అవకాశం
- కాక్రోచ్ జనతా పార్టీ వల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందని వేణుస్వామి వ్యాఖ్యలు
