Advertisement

AP OAMDC Seat Allotment Result 2025 : మొదటి విడత ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

AP OAMDC Allotment Result 2025 : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించే AP OAMDC Seat Allotment Result 2025 మొదటి విడత ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే అప్లయ్ చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ సీట్ కేటాయింపు తెలుసుకోవచ్చు.

Advertisement

సీట్ కేటాయింపు ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు తమ ఈమెయిల్, పాస్వర్డ్, అప్లికేషన్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. కేటాయించిన సీటు, కోర్సు, ర్యాంక్, కళాశాల వివరాలు ఆన్లైన్ లో చూడొచ్చు. అలాగే కేటాయింపు లేఖను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీటు కేటాయించబడిన అభ్యర్థులు ఆన్లైన్ లో స్వీకరించాలి. అలాగే కేటాయించిన కళాశాలకు వెళ్లి పత్రాల ధృవీకరణ పూర్తి చేయాలి. అసలు పత్రాలతో పాటు కాపీలు సమర్పించాలి. నిర్దేశిత సమయంలో ప్రవేశ ఫీజు చెల్లించాలి.

ఆన్లైన్ లో సీటు స్వీకరించి, అప్గ్రేడ్ చేసుకునే వారు కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రవేశాలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 9, 2025 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ఫలితాలు విడుదల కాలేదు. సాయంత్రం 6 గంటలలోపు లేదా రాత్రి 9 గంటల లోపు విడుదల చేయడం అవకాశం ఉంది. ఆలస్యమైతే సెప్టెంబర్ 9న ఉదయం విడుదల చేస్తారు.

Advertisement

AP OAMDC కింద సీటు కేటాయించిన కళాశాలల్లో ఏడియోని, అమల్ డిగ్రీ కళాశాల, అన్నపూర్ణ మెమోరియల్ మాడర్న్ డిగ్రీ కళాశాల, ఏకేఆర్జీ డిగ్రీ కళాశాల, యూనిటీ డిగ్రీ కళాశాల, ఏబీఎం డిగ్రీ కళాశాల, అదిత్య డిగ్రీ కళాశాల, ఏసీ డిగ్రీ కళాశాల, ఎక్ట్స్ డిగ్రీ కళాశాల పేర్లు ఉన్నాయి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement