BiggBoss 9 Telugu Naga prashanth : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) గ్రాండ్ గా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ ఆకట్టుకునే విధంగా ఉన్నారు. కానీ డిమోన్ పవన్ ఎంపికపై ప్రేక్షకుల్లో అసంతృప్తి నెలకొంది. అగ్నిపరీక్ష షోలో అతను పెద్దగా ప్రతిభ చూపలేదు. టాస్క్ లలో బలహీనంగా ఉన్నాడు. అయినా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది.
అసలు జడ్జీలు ఎంపిక చేయాల్సింది నాగ ప్రశాంత్ అని చాలామంది భావించారు. అతనికి రెండు స్టార్స్ వచ్చాయి. చివరి నాలుగు ఎపిసోడ్స్ లో ఇతడికి మంచి హైప్ వచ్చింది. ఓటింగ్ రేస్ లో కూడా డిమోన్ పవన్ కంటే ముందు ఉన్నాడని సమాచారం.
అయినా జడ్జీలు నాగ ప్రశాంత్ ని ఎంపిక చేయకపోవడం గమనార్హం. పవన్ కంటే బలమైన ప్రతిభ ఉన్న నాగ ప్రశాంత్ ని పక్కన పెట్టడం ప్రేక్షకుల్లో అన్యాయం అనే భావన కలిగించింది. సెప్టెంబర్ 28 న రీ-లాంచ్ ఎపిసోడ్ ఉంది. దీని ద్వారా నాగ ప్రశాంత్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం ఉంది. ప్రేక్షకులు కూడా అతని ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
