Advertisement

Bigg Boss 9 Suman Shetty : సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి హౌస్ లో పట్టించుకోకపోవడం ఆశ్చర్యం

Bigg Boss 9 telugu Suman Shetty : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) లో చివరి సెలబ్రిటీ కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి ( Biggboss Suman Shetty )ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, 300కి పైగా సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, భోజ్ పూరి భాషల్లో కూడా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇటీవల సినిమాల్లో కాస్త తగ్గిన సుమన్ శెట్టి, బిగ్ బాస్ షో ద్వారా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. పొట్టి కట్ లో ఉన్న ఆయన ఫిజికల్ టాస్క్ లలో ఎంత వరకు పాల్గొనగలడనేది ప్రేక్షకుల్లో ప్రశ్న.

హౌస్ లోని ఇతర కంటెస్టెంట్స్ బలంగా, శక్తివంతంగా కనిపిస్తున్నారు. సుమన్ శెట్టి వారితో పోటీ పడగలడా అనేది అనుమానం. అంతేకాదు, ఆయనకు సరైన గౌరవం లభించడం లేదు. అగ్నిపరీక్ష నుండి వచ్చిన ప్రియా శెట్టి ఇతరులందరినీ పలకరించినా, సుమన్ శెట్టిని పలకరించలేదు. ఇది చూసి ఆయన పట్ల ఇతర కంటెస్టెంట్స్ తక్కువ అంచనా వేస్తున్నారని అనిపిస్తోంది.

Advertisement

గతంలో పల్లవి ప్రశాంత్ ని తక్కువ అంచనా వేసి చివరికి విజేతగా నిలిచాడు. సుమన్ శెట్టి కూడా అలాంటి అనుభవం ఎదుర్కొంటాడా లేదా అనేది చూడాలి. ప్రేక్షకుల మద్దతు ఇస్తే, ఆయన ఆశ్చర్యపరిచే ప్రదర్శన ఇవ్వొచ్చు.

Advertisement