Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన అర్జున్ దాస్ క్రైమ్ కామెడీ సినిమా ‘కాన్ సిటీ’

మన పత్రిక: తమిళ నటుడు అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన హెయిస్ట్ క్రైమ్ కామెడీ చిత్రం ‘Con City’ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్న బెన్, యోగి బాబు, వడివుక్కరసి, రాధా రవి, తంబి రామయ్య, విటివి గణేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతం అందించగా, పవర్ హౌస్ పిక్చర్స్, క్లౌట్ స్టూడియోస్, ఎం అండ్ ఎం మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా, డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

Advertisement
Advertisement