Advertisement

కర్ణాటకలో దారుణం: 13 రోజుల ఆడబిడ్డను నీటి తొట్టిలో పడేసి చంపిన తండ్రి

మన పత్రిక, చిక్కబళ్లాపూర్: కర్ణాటకలోని Chikkaballapur పట్టణంలో 13 రోజుల ఆడపిల్ల హత్యకు గురైన దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆడపిల్ల జన్మించిందనే కోపంతోనే సొంత తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జులై 22న రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రపోతున్న సమయంలో, ఇమ్రాన్ నిద్రపోతున్న పసిపాపను ఇంట్లోని నీటి సంప్‌లో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉదయం లేచి చూడగా పాప కనిపించకపోవడంతో తల్లి భర్తను ప్రశ్నించింది. తనకు ఏమీ తెలియదని నమ్మించిన ఇమ్రాన్, పాప కోసం ఇతరులతో కలసి వెతికే నాటకమాడాడు. చివరికి నీటి సంప్‌లోని నీటిని తోడి చూడగా పాప మృతదేహం బయటపడింది.

Advertisement

బాధితుల ఫిర్యాదు మేరకు చిక్కబళ్లాపూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మగసంతానం కావాలనే కోరికతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పసిపాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement