మన పత్రిక: పంట కాలువకు అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టిన ఘటనపై జలవనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన కాంట్రాక్టర్ తో పాటు సంబంధిత ఆర్ అండ్ బీ అధికారిపై కేసు నమోదు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కోనసీమ జిల్లా పరిధిలోని ఓ పంట కాలువకు అడ్డంగా గోడ నిర్మించారని బాధిత రైతులు నేరుగా మంత్రి నిమ్మల రామానాయుడుకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఉత్తర్వుల మేరకు అధికారుల ఫిర్యాదుతో అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ అధికారిపై కేసులు నమోదు చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- నెల్లూరు జిల్లాలో విషాదం గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం ఆత్మహత్య
- 26 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను విరమించిన సోనమ్ వాంగ్చుక్
- పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన బిల్లు తీసుకువస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ
- చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్లకు మంచి స్పందన
- విద్యార్థులకు రక్షణ కల్పించాలి, విలన్లుగా చిత్రీకరించవద్దు: గీతాంజలి అంగ్మో
