మన పత్రిక, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. శ్రీపతి సాయి చందన ప్రియ అనే ఏఎన్ఎం సచివాలయంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.
తన మరణానంతరం వచ్చే రూ.60 లక్షల బీమా సొమ్మును తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కోసం ఉపయోగించాలని ఆమె ఆ లేఖలో కోరారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రుల దయనీయ పరిస్థితి తట్టుకోలేక ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
