Bigg Boss 9 Telugu Shrasti Verma: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా పాల్గొంటున్నారు. జానీ మాస్టర్ మీద కేసు పెట్టి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ( Biggboss Shrasti Verma ) సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
శ్రేష్టి వర్మ ధైర్యంగా పోరాడిన తీరు చాలామందికి స్ఫూర్తినిచ్చింది. జానీ మాస్టర్ లాంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద కేసు పెట్టి న్యాయం కోసం పోరాడింది. ఈ ధైర్యాన్ని గుర్తించిన బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను హౌస్ లోకి తీసుకురావడం విశేషం.
ఇంట్రో సమయంలోనే శ్రేష్టి నాగార్జునను మెప్పించింది. డాన్స్ చేయమని అడిగితే, ‘హలో బ్రదర్’ సినిమాలోని ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ పాటకు డాన్స్ చేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకుంది. నాగార్జున కూడా ఆమె కొరియోగ్రఫీపై మెగ్గు చూపి, షో తర్వాత తన సినిమాలో డాన్స్ చేయాలని కోరాడు.
శ్రేష్టి వర్మ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ టఫ్ ఫైట్ ఇస్తానని స్పష్టం చేసింది. ఆమె పోరాట స్వభావం, డాన్స్ ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఆమెను విజేతగా నిలిపే అవకాశాలు పెంచుతున్నాయి. ఆమె అభిమానులు కూడా ఆమె ఫైనల్ వరకు వెళ్తుందని నమ్ముతున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- ఆగస్టు 5 రాశిఫలాలు: గ్రహాల సంచారంతో ఆ రాశుల వారికి ధనలాభాలు
- లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: భారీ గ్యాప్ అప్తో ప్రారంభమయ్యే అవకాశం
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
