Advertisement

సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి: సీఎం చంద్రబాబు

మన పత్రిక, విజయవాడ: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పోలీసు వ్యవస్థ పనితీరులో మార్పులు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి CM Chandrababu సూచించారు. విజయవాడలో నిర్వహించిన ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ ఘటనలో జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నాలుగైదు రోజులు పట్టిందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

రాష్ట్రంలో గంజాయి వినియోగం, సైబర్ నేరాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా నేరాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నేరస్థులకు కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటేనే నేరాలు అదుపులోకి వస్తాయని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement