మన పత్రిక: జూనియర్ ఎన్టీఆర్ మద్దతుదారుల వేదికగా ప్రచారం పొందిన RAW NTR సంస్థ తమ కార్యకలాపాలను హఠాత్తుగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సామాజిక సేవల ద్వారా ఎన్టీఆర్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంతో ఇటీవల సోషల్ మీడియాలో, తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సంస్థ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తమ సంస్థను మూసివేస్తున్నట్లు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రతినిధులు వెల్లడించారు. సంస్థను మూసివేసేలా కష్టపడిన ప్రతిఒక్కరికీ అభినందనలు అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘ఊరు-వాడ’ పేరిట గ్రామాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, దాదాపు రూ.100 కోట్ల విలువైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని RAW NTR గతంలో ప్రకటించింది. అయితే ఈ సంస్థతో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన అధికారిక బృందం స్పష్టం చేసింది. అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగించడంపై తీవ్ర హెచ్చరికలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థను ఎందుకు ప్రారంభించారు, ఇప్పటివరకు ఏమైనా సేవలు చేశారా లేదా కేవలం ప్రచారం కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మూసివేతపై రాబోయే రోజుల్లో ప్రతినిధులు ఏమైనా స్పష్టత ఇస్తారేమో వేచి చూడాల్సి ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
