Bigg Boss 9 Telugu Pawan Kalyan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) ఘనంగా ప్రారంభమైంది. మొదటి రెండు స్థానాల్లో తనూజా గౌడ, ఫ్లోరా షైనీ హౌస్ లోకి వెళ్లారు. అగ్నిపరీక్ష నుండి మూడో కంటెస్టెంట్ గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు ఆర్మీ అధికారి కావడంతో పాటు ‘ఆపరేషన్ సింధూర్’ లో వీరోచిత పోరాటం చేసిన విషయం తెలిసిందే.
అగ్నిపరీక్ష షోలో పవన్ కళ్యాణ్ తెలివితేటలతో ప్రేక్షకుల మనసు గెలిచాడు. టాస్క్ లను చక్కగా నిర్వహించడం, సింపుల్ గా ఉండటం, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకపోవడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే నాగార్జున పవన్ కళ్యాణ్ కి మొదటి టాస్క్ ఇచ్చాడు. తనూజ, ఫ్లోరా షైనీ లలో ఒకరికి బాత్రూం క్లీనింగ్ డ్యూటీ ఇవ్వాలని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఫ్లోరా షైనీ కి ఆ బాధ్యత ఇచ్చాడు. ఆమె మొదట అంగీకరించకపోయినా, చివరికి అంగీకరించింది. దీంతో అతడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు.
ఫ్లోరా షైనీ తర్వాత పవన్ కళ్యాణ్ ని సవాల్ చేస్తూ, తనకు ఛాన్స్ వస్తే తాను కూడా చూపిస్తానని చెప్పింది. పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఒక సైనికుడు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఇదే మొదటిసారి. అతడు విన్నర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
