మన పత్రిక: తిరుపతిలో 16 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్సీపీ నాయకుడు Bhumana Karunakar Reddy తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాననే పగతోనే ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇలాంటి విధ్వంసాలకు భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా భూమనా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సదరు భూమిని తాను 21 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశానని చెప్పారు. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కానీ, అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇవి ఆక్రమణలుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ అవినీతికి, మోసాలకు పాల్పడలేదని, తిరుపతిలో రౌడీ రాజకీయాలు లేకుండా విలువలతో కూడిన రాజకీయం చేశానని పేర్కొన్నారు. కుటుంబ ఆస్తులను ఎంత ధ్వంసం చేసినా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటానని, 1991లో ప్రారంభించిన హెరిటేజ్ సంస్థ కూడా నది పోరంబోకు స్థలంలోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- సత్తుపల్లిలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పిడి చట్టం కింద ఇద్దరు నేరస్థులపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
- తల్లికి వందనం డబ్బులు రానివారు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి
- ఆటోమేటిక్ ఇన్సెంటివ్ వ్యవస్థపై మంత్రుల బృందం తొలి సమావేశం నిర్వహించిన నారా లోకేశ్
- రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు: 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
