Advertisement

వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

మన పత్రిక: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే Jakkampudi Raja పై కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కర్నూలు సీఐ శేషయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కర్నూలు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఇటీవల కర్నూలులో జరిగిన ఒక ధర్నాలో పాల్గొన్న జక్కంపూడి రాజా, స్థానిక సీఐ శేషయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు శేషయ్య తమ పార్టీ టికెట్ కోసం వచ్చారని, కోట్ల రూపాయల డబ్బుతో ఎన్నికలకు సిద్ధమయ్యారని, అయితే అవినీతిపరులకు టికెట్ ఇవ్వబోమని చెప్పి ఆయనను పంపేశామని ఆరోపించారు. అంతేకాకుండా, ఒక వైసీపీ కార్యకర్తను సీఐ వేధించారని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఐని తమ ఇంటి గేటు వద్దే ఎండలో, వానలో నిలబెడతామని బహిరంగంగా హెచ్చరించారు.

Advertisement

ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ సీఐ శేషయ్య ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడ సమర్పించిన ఆధారాలను, ఆడియో, వీడియోలను పరిశీలించిన ఎస్సీ కమిషన్ జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు కర్నూలు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలని జక్కంపూడి రాజాకు నోటీసులు పంపారు.

Advertisement