Advertisement

తిరుమలను రాజకీయం చేయవద్దని వైసీపీ నేతలకు భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరిక

మన పత్రిక: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను తమ రాజకీయ లబ్ధికి వేదికగా మార్చవద్దని TTD బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు Bhanu Prakash Reddy వైసీపీ నేతలను హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని, ఆలయ వ్యవహారాలను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరుమల ఘాట్ రోడ్డులో చోరీకి గురైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని పోలీసులు 24 గంటల్లోనే స్వాధీనం చేసుకున్నారని, ఆ వెంటనే దానిని పునఃప్రతిష్ఠించామని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. గత వైసీపీ పాలనలో పలు ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపించిన ఆయన, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఆలయాల పరిపాలన పారదర్శకంగా సాగుతోందని చెప్పారు. TTD నిధుల మళ్లింపుపై మాట్లాడే ముందు ఆధారాలు చూపాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆలయ పాలనతో పాటు ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు సిద్ధమని, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement